భీక్యా తండా గ్రామ పంచాయతీకి ‘క్షయ రహిత’ పురస్కారం
Mbmtelugunews//కోదాడ, మార్చి 24( ప్రతినిధి మాతంగి సురేష్): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిబి ముక్త భారత్ అభియాన్ లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండల పరిధిలోని భీక్యా తండా గ్రామ పంచాయతీకి అరుదైన ఘనతను సాధించింది. గ్రామంలో ఒక్కరు కూడా క్షయ వ్యాధిగ్రస్తులు లేని విధంగా పూర్తిస్థాయిలో టిబి రహిత పంచాయతీగా తీర్చిదిద్దినందుకు గాను, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచి భానోత్ ఝాన్సీ బాలాజీ, పంచాయతీ కార్యదర్శి వి ఉపేందర్ కి ప్రశంసా పత్రం లభించింది.

కలెక్టర్ ప్రశంస జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డును ప్రదానం చేస్తూ, భీక్యా తండా గ్రామాన్ని ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
సమిష్టి కృషి సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, ఆరోగ్య శాఖ వారు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజల సహకారంతోనే ఈ అవార్డు సాధ్యమైందని గ్రామ ప్రతినిధులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. మా గ్రామాన్ని టిబి రహితంగా తీర్చిదిద్ది, కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మా గ్రామ ప్రజలందరికీ గర్వకారణం. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాంమని సర్పంచి బి ఝాన్సీ బాలాజీ, పంచాయతీ కార్యదర్శి
వి ఉపేందర్ తెలిపారు.



