కోదాడ,ఏప్రిల్ 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి దంపతుల వివాహ వార్షిక వేడుకల సందర్భంగా కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలే కన్నబిడ్డలుగా భావించి ప్రజాసేవ అంకితమైన ఈ ఆదర్శ దంపతులు ప్రజల ఆశీస్సులతో కలకాలం వర్ధిల్లాలని భగవంతుని కోరారు. రాజకీయంగా రాబోయే రోజులలో మరెన్నో పదవులు పొంది ఈ రెండు నియోజకవర్గాలు అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి,ఎమ్మెల్యే వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ
RELATED ARTICLES



