మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు
Mbmtelugunews//కోదాడడిసెంబర్ 25( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక సీసీ రెడ్డి కాన్వెంట్‌లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ళ కృష్ణా రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి అభివాదం చేశారు. మంత్రి ఉత్తమ్ కృష్ణా రావును ఆత్మీయంగా పలకరించినారు. అనంతరం కృష్ణారావు మంత్రి తో కొంతసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



