మందు సీటింగు స్టఫ్ మొత్తం మావే
:యువతను మత్తులోకి దింపుతున్న దాబాలు
:12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు వారే ఎక్కువ దాబాలలో సిటింగులు
:భారీ మొత్తంలో సంబంధిత అధికారులకు ముడుపులు అందుతున్నాయి అనే గుసగుసలు
:ఈ దాబాల వలన యువత భారీ మొత్తంలో చెడు అలవాట్లకు గురవుతున్నారు.
:రాత్రి 12 గంటల వరకు యదేచ్చగా సిటింగుల లాభాలు
:ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని పలువురు ఆవేదన
Mbmtelugunews//హుజూర్ నగర్,జనవరి 09:మేళ్లచెరువు పట్టణ పరిధిలో గల దాబాలు మళ్లీ పక్కదారి పట్టాయి.ఈ దాబాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.అధికారులు హడావిడి చేసినప్పుడు దాబాల యజమానులు జాగ్రత్త పడుతుండడం,కొద్దిరోజులకు మళ్లీ పాత విధానంలోకే వెళ్లడం మామూలైపోయింది.మేళ్లచెరువు పట్టణంలోని ఉన్న దాబాలు బార్‌లను తలపిస్తున్నాయి.చాలా మంది యువత దాబాలనే మద్యం తాగడానికి అడ్డాగా మార్చుకుంటున్నారు.ఎవరైనా అధికారి తనిఖీకి వచ్చే అవకాశముందని తెలిస్తే కష్టమర్లకు జాగ్రత్తలు చెబుతున్నారు.ప్రధానంగా యువత వారి వ్యక్తిగత పార్టీల పేరుతో గ్రూపులుగా దాబాలకు వెళ్లి అక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారులను ఆనుకొని దాబాలు వెలిశాయి. మేళ్లచెరువు నుండి హుజూర్ నగర్,వెళ్లే ప్రధాన రహదారిలో ఈ దాబాలు ఉన్నాయి.ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాహనదారులు గంటలకొద్దీ దాబాలలో తిష్టవేస్తున్నారు.
అర్ధరాత్రి 12 గంటల వరకు భోజనాలు,మద్యం తాగడం వంటివి చేస్తున్నారు.ప్రభుత్వ బార్‌లకే రాత్రి 11 గంటల వరకు అనుమతివ్వగా..దాబాలు మాత్రం అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయి.సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.సంబంధిత అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నాయని..అందుకే పట్టించుకోవడం లేదనే అపోహలు కూడా వినిపిస్తోంది.ఈ దాబాలలో ఇష్టానుసారంగా యువత తాగి రోడ్డుపై వాహనాలు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.అయినా సరే దాబాల యజమానులు మాత్రం మందు,స్టఫ్ మా దగ్గరే దొరికింది అంటూ భారీ మొత్తంలో వ్యాపారం కొనసాగిస్తున్నారు.ఆప్కారి శాఖ వారు దాబాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావుతీస్తుందని అన్నారు.ఈ దాబాల వలన యువత ఎక్కువ మొత్తంలో మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని ఇకనైనా సంబంధిత అధికారులు బాబాలపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వాపోతున్నారు.