:అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు
సూర్యాపేట,ఏప్రిల్ 23 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జిల్లాలో చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు హెచ్చరించారు.జిల్లాలో అక్రమంగా చెరువుల నుండి మట్టి తరలించడం పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లడంతో మంగళవారం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.రెవెన్యూ, ఇరిగేషన్,పంచాయతీ శాఖల సమన్వయంతో అక్రమ మట్టి తరలింపు అడ్డుకుంటామన్నారు.జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తే ఉపేక్షించేది లేదని,భాద్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.రెవెన్యూ,ఇరిగేషన్,పోలీస్,మైనింగ్ శాఖల అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.



