మట్టి విగ్రహాలనే పూజించాలి
పర్యావరణాన్ని కాపాడాలి
:మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ
బాబు.
Mbmtelugunews//కోదాడ ఆగస్టు 26(ప్రతినిధి మాతంగి సురేష్)మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నివాసంలో 500 మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు పట్టణంలో మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు అన్ని జాగ్రత్తలు పాటించి పూజలు జరుపుకోవాలని అన్నారు.

అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రంగురంగుల రసాయనాలతో తయారుచేసిన విగ్రహాల నీటిలో నిమజ్జనం చేయడం వలన నీరు కలుషితమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. కనుక మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ తిపిరిశెట్టి రాజు, కాజా గౌడ్, ఒంటిపులి రమా శ్రీనివాస్, ఎర్రవరం సొసైటీ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రావిళ్ళ కృష్ణారావు, లైటింగ్ ప్రసాద్, నెమ్మాది దేవమణి ప్రకాష్ బాబు, మేకపోతుల సత్యనారాయణ, గంధం పాండు, ఆర్ వెంకటేశ్వరరావు, గోల్డ్ షాప్ రమేష్, పారా వెంకటేశ్వరరావు, మల్లు నాగిరెడ్డి, తోకల విజయ, చామర్తి బ్రహ్మం, వేమూరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.



