కోదాడ,జులై 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు వంటెపాక జానకి యేసయ్య స్థానిక నయానగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి యేసయ్య మాట్లాడుతూ మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నదని తల్లిలాంటి ఆ స్త్రీలను భారత మాతగా గౌరంగా పిలుచుకొనే స్త్రీలను అవమానకరంగా ఊరేగించడం వారిపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హత్య చేయటం దారుణమైన సంఘటన అని ఆమె అన్నారు.దుండగులను కఠినంగా శిక్షించాలని ఏ విషయమై అక్కడి ప్రభుత్వాలు కోర్టు తగిన చర్యలు తీసుకొని అక్కడ క్రైస్తవులకు తగు న్యాయం జరిగించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి త్వరలోనే అన్ని క్రైస్తవ సంఘాలతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని ఈ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ రెవరెండ్ వి. యేసయ్య,రెవ.జోసఫ్ రాజ్,పాస్టర్ ప్రభుదాస్,పాస్టర్ రమేష్,పాస్టర్ పౌల్ చారి,పాస్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్ లో స్త్రీలపై జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం
RELATED ARTICLES