మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు.
:ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలి..
:ఐఎఫ్టియు అధ్యర్యంలో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
:మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కు వినతి పత్రాలు అందజేత.
Mbmtelugunews//మణుగూరు,నవంబర్ 22(మనం న్యూస్):మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గుగనుల ఏర్పాటుతోపాటు ఉన్నగనులకు విస్తరణ అనుమతులు సాధించాలనీ కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహకారంతో ఐఎఫ్టియు అధ్యర్యంలో రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ,సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంలకు శుక్రవారంనాడు వినతిపత్రాలు అందజేసినట్లు ఐ.ఎఫ్.టి.యు అనుబంధ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్.డి నాసర్ పాషా విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఓసి గనులు మూతపడనున్నాయనీ,కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచిఉందనీ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మణుగూరులో కొత్త గనుల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలనీ,ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలనీ,అన్ని గనులు సింగరేణి ఆధ్వర్యంలోనే నడిపించాలని ప్రజా ప్రతినిధులను కోరినట్లు ఆయన తెలిపారు.దీంతోపాటు మణుగూరుకు వరద ముంపును నివారిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలనీ,ఇటీవల భారీ వర్షాలకు వరద ముంపునకు గురై సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు ఇందిరమ్మ పక్కాఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిర్మించాలని ఆయన కోరారు.అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ,సింగరేణి భూనిర్వాసితులకు,ప్రభావిత గ్రామాల యువతకు,సింగరేణి డిపెండెంట్లకు,స్థానికులకు సింగరేణి ఓబి కంపెనీలలో,సెక్యూరిటీ మరియు ఇతర సివిల్ కాంట్రాక్ట్ పనులలో ఉపాధి అవకాశాలు కల్పించాలనీ,మణుగూరులో ట్రాఫిక్ నివారణకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలనీ,పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు మణుగూరులో ఐదు సెంట్ల భూమిలో గృహ నిర్మాణం చేపడితే ఇబ్బందులు లేకుండా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గుడిపూడి కోటేశ్వరరావు,ఎస్.డి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.