మతసామరస్యానికి ప్రతీకలు ఇఫ్తార్ విందులు
:ఐక్యతకు,సోదర భావాలకు ఆదర్శంగా నిలుస్తున్న రంజాన్ మాస ఇఫ్తార్ విందులు…
:శెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ప్రారంభించిన స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి జబ్బర్.
Mbmtelugunews//కోదాడ,మార్చి 27(ప్రతినిధి మాతంగి సురేష్):ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతికలుగా నిలుస్తాయని స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి జబ్బర్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని 26 వార్డు రోశమ్మ వీధిలో శెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఐక్యతకు సోదర భావానికి రవికుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.ఉపవాస దీక్షకుల దీవెనలు ప్రజలందరికీ ఉంటాయన్నారు.దానధర్మాలకు రంజాన్ మాసం ప్రతీక అన్నారు.పవిత్ర రంజాన్ మాసం ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇఫ్తార్ విందు నిర్వాహకులు శెట్టి రవికుమార్,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శెట్టి వెంకటేశ్వర్లు,ప్రభుత్వ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు,అంజయ్య నాయకులు పంది తిరపయ్య,దొంగరి శీను,స్థానిక వార్డు మైనార్టీ నాయకులు,రవికుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు.