కోదాడ,మార్చి 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమనేది మతసామరస్యానికి ప్రతీక అని కోదాడ పురపాలక సంఘం చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు.ఆదివారం పట్టణంలోని కొమరబండ పరిధిలోని 10వ వార్డులో మామిడి రామారావు దంపతులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇఫ్తార్ విందును ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతు హిందూ,ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా ఇఫ్తార్ విందు నిలవడం అభినందనీయమన్నారు. ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులకు అన్ని కులాలు అన్ని మతాల వారిని పిలవడం మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మామిడి పద్మావతి,వంగవీటి రామారావు,జాన్ మహ్మద్ సర్,మునీర్ సర్,అబ్దుల్,నాగూల్,రఫీ,సీతయ్య,కిట్టు,లక్ష్మి నారాయణ,గోపి తదితరులు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు:మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్
RELATED ARTICLES



