మనం పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది:ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యాంసుందర్
కోదాడ,జూన్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలో కోర్టు ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణంలో కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యాంసుందర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ.మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యాంసుందర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ విధిగా ఇలాంటి సందర్భాలలో మొక్కలు నాటాలని వాటి పరిరక్షణ చేసి వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చు అని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి,సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి,బార్ అసోసియేషన్ సభ్యులు మంద వెంకటేశ్వర్లు,హేమలత,దొడ్డ శ్రీధర్,సామా నవీన్ కుమార్,ఎస్.కె నాగుల్ పాషా,ధనలక్ష్మి సీనియర్ న్యాయవాదులు బండి వీరభద్రం,సుదర్శన్ రావు,తాటి మురళి,సుల్తాన్ నాగరాజు,శరత్ కుమార్,కోర్టు సూపర్డెంట్ మహమ్మద్ సోహెల్ మండల లీగల్ సెల్ సభ్యులు అనిత,జి మౌనిక,శైలజ తదితరులు పాల్గొన్నారు.



