Sunday, February 8, 2026
[t4b-ticker]

మరో ఉద్యమానికి శ్రీకారం…

మరో ఉద్యమానికి శ్రీకారం…

:జనవరి 4 న కోదాడకు కల్వకుంట్ల కవిత….

Mbmtelugunews//కోదాడ, జనవరి 02(ప్రతినిధి మాతంగి సురేష్): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, ఎన్నికల హామీలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల భూమి, పెన్షన్, సంక్షేమ బోర్డు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఉద్యమకారుల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని తెలంగాణ ఉద్యమకారుడు గన్న శ్యామ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 4 తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో ఉద్యమ శ్రీకారంలో భాగంగా కోదాడ విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులు, అభిమానులు హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు పెన్షన్ సంక్షేమ బోర్డు 250 గజాల ఇళ్ల స్థలం లాంటి హామీలు ఇచ్చి మాట మర్చిపోయిందని ఆరోపించారు. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular