Tuesday, July 8, 2025
[t4b-ticker]

మలుపు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కోదాడ,ఆగష్టు 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోని కొమరబండ గ్రామంలో మలుపు సంస్థ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని అన్నారు.యువత ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు పుట్టిన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని యువత అభివృద్ధిలో ముందుకు పోవాలని అన్నారు.అనంతరం మలుపు సభ్యులు దాసరి జయసూర్య మాట్లాడుతూ 2000 సంవత్సరంలో మలుపు అనే ఒక వ్యవస్థని స్థాపించి ఆ వ్యవస్థ నుండి ఎంతోమంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు మలుపు సంస్థ ద్వారా పరిశ్రమలలో శిక్షణ ఇప్పించి వేల మందికి జీవితాల్లో వెలుగు నింపి,జీవనోపాధి కల్పించి ఆదర్శంగా నిలిచారు అని అన్నారు.మాజీ తెలంగాణ డిజిపి టికృష్ణ ప్రసాద్ ఐపీఎస్ వారు లిడ్ క్యాప్(లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంతోమందికి తోళ్ల పరిశ్రమలో శిక్షణ ఇప్పించి ప్రతి జిల్లాకి మలుపు ప్రాంగణాలను ఏర్పాటు చేసి అక్కడ పరిశ్రమలు నిర్మించి ఉపాధిని అందించేవారు.కొంతకాలం తర్వాత ఆ వ్యవస్థని కొన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి అయితే మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించి గతంలో ట్రైనింగ్ తీసుకోని అభివృద్ధికి నోచుకోని కొంతమందిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ప్రభుత్వం కేటాయించిన భూమిని శిక్షణ పొందిన వారికి కేటాయించి జీవనోపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రస్తుత కేంద్ర గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ వారికి ఇండ్ల స్థలాలు మరియు ఇండ్లు నిర్మాణం ప్రతి ఒక్క శిక్షకునికి ఇవ్వాలని,ఇప్పుడు ఏదైతే దళిత బంధునిస్తున్నారో దానిలో భాగంగా వారికి కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి పరిశ్రమలు నెలకొల్పే విధంగా సహాయం చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలని వారు డిమాండ్ చేసిన్నారు.ఈ కార్యక్రమంలో వంగాల పిచ్చయ్య,పి తిరపయ్య,ఏపూరి రాజు,పిడమర్తి వెంకటేశ్వర్లు,కె పేతురు,మాదాసు దానియేలు,దాసర అరవింద్,గుంజలూరి నాగేంద్రబాబు,మాదాసురాజేష్,గుంజలూరి నాగేష్,డి శేఖర్,ఎం నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular