కోదాడ,జనవరి 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జనాబ్ మహమ్మద్ అలీ షబ్బీర్ మాజీ మంత్రి ,5% ముస్లిం రిజర్వేషన్ సాధనకై పోరాడి,విజేయుడై ఎన్నో ముస్లిం కుటుంబాలకు (సుమారు 20 లక్షల పేద ముస్లిం) వెలుగునిచ్చి నిత్యం ముస్లింల అభివృద్ధికై పాటుపడుతూ,ముస్లిం సబ్ ప్లాన్ ను అమలు పరిచేలా కృషిచేస్తున్న షబ్బీర్ అలీని ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీల సంక్షేమాల ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాలో నియామకం పట్ల కోదాడ ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్,గైడర్స్ అసోసియేషన్ (మెగా) అధ్యక్ష,కార్యదర్శులు షేక్ జాన్ పాషా,జహీర్ ఖాన్ లు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు గులాం ఎస్దాని గారు, జాఫర్ గారు, సాహెబ్ అలీ,మొయినుద్దీన్, ఖమర్ సుల్తాన గార్లు పాల్గొన్నారు.
మహమ్మద్ అలీ షబ్బీర్ ని కేబినెట్ హోదాలో ప్రభుత్వసలహాదారుగా నియమించటం పట్ల మెగా హర్షం
RELATED ARTICLES



