మహాఅన్నదాన కార్యక్రమం…
కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని నల్లబండగూడెం సాయిబాబా దేవాలయంలో చిమిర్యాల గ్రామానికి చెందిన రావూరి రాకేష్ లక్ష్మీ దంపతుల కుమార్తె ఆరాధ్య అన్నప్రాసన్న కార్యక్రమం సందర్భంగా దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు,రావూరి పూర్ణయ్య,నల్లూరి అప్పారావు,అల్సగాని బ్రహ్మయ్య,చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ రఘుపతి, శరభయ్య,మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్,కొత్త బ్రహ్మయ్య,మాజీ సర్పంచ్ ధరావత్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.