కోదాడ,ఏప్రిల్ 24(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక మసీద్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ పాల్గొని మాట్లాడుతూ మహారాష్ట్రలోని అమ్మవాడ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ కేంద్రంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనుడని,ఒక నూతన భారతదేశానికి లౌకిక రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య పరిపాలనకు అద్యుడని అలాగే మహాజన వర్గాల వారికి తాను రాసిన రాజ్యాంగం ప్రకారం పొందిన రిజర్వేషన్ ఫలాల ద్వారా
ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,వర్గాలు విద్య,ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాలలో నేడు ముందుకు పోయారని,దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించిన మహోన్నతుడని తెలుపుతూ నేటి యువత అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు ఆలోచనలను పునుకిపుచ్చుకొని ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు ఏపూరి పర్వతాలు,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కర్ల కాంతారావు మాదిగ,జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ,మండల ఉపాధ్యక్షులు కుడుముల శ్రీనివాస్ మాదిగ,మండల నాయకులు బచ్చలకూరి వెంకన్న మాదిగ,పట్టణ అధ్యక్షుడు వల్లపట్ల వంశీ మాదిగ,పట్టణ నాయకులు షేక్ జానీ పాషా,పట్టణ కార్యదర్శి గజ్జి గోపి మాదిగ,పట్టణ నాయకుకు పగిడిపల్లి ప్రేమ్ కుమార్ మాదిగ,రాయల వెంకన్న,పాముల శ్రావణ్,బత్తుల వెంకటేష్,ఇరుగు రాములు,ఏపూరి పుల్లయ్య,గంధం రాము,పంది ఈశ్వర్,ఉప్పెల్లి ఠాగూర్,ఏపూరి అఖిల్,ఎస్.కె జమాల్,పంది ఉపేందర్,దొండపాటి హార్ష,కందుల రాఖీ,లు పాల్గొన్నారు.
మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు
RELATED ARTICLES



