మహిళలు అన్ని రంగాలలో రాణించాలి:డాక్టర్ ధర్మతేజ
Mbmtelugunews//కోదాడ,మార్చి 08(ప్రతినిధి మాతంగి సురేష్):మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కాపుగల్లు ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు ధర్మతేజ అన్నారు.శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించి విస్తృతంగా సమాజంలో ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు హాస్పిటల్ కు వచ్చే అన్ని వర్గాల ప్రజలకు ప్రేమ ఆప్యాయలతో సేవలు అందించి మంచి పేరు సంపాదించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి కృష్ణవేణి సూపర్ వైజర్లు శ్యాంసుందర్ రెడ్డి,సిద్దమ్మ స్టాఫ్ నర్సులు ప్రమీల,ల్యాబ్ టెక్నీషియన్ స్రవంతి,ఏఎన్ఎంలు విజయలక్ష్మి,శ్రీదేవి,గోపమ్మ, విజయ్,చంద్రకళ,రూప,సంతోషమ్మ,మాధురి తదితరులు పాల్గొన్నారు