మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 07(మనం న్యూస్):సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు,కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో,షీ టీమ్ ఎస్ఐ నీలిమ సూచనల మేరకు చిలుకూరు మండలంలో గల మహాత్మా జ్యోతిభా పులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల,జూనియర్ కళాశాలలో చిలుకూరు ఎస్ఐ రాంబాబు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి షి టీమ్ ఏఎస్ఐ కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్ 8712686056 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.టీ సేఫ్ యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు.తమ ఫోటోలు గాని కుటుంబ సభ్యుల సమాచారం గాని సామాజిక మాధ్యమాలలో పెట్టకూడదని అన్నారు.వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.చిలుకూరు ఏఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ తమ వ్యక్తిగత సమాచారం,బ్యాంకు వివరాలు,ఏటీఎం పిన్ నెంబర్లు,సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు.సైబర్ నేరాల భారిన పడితే అధైర్య పడకుండా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోవింద్,కానిస్టేబుల్ యాకూబ్,మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి,చిలుకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది,కళాశాల సిబ్బంది సరళ,సుజాత,విద్యార్థినిలు తదితరులు పాల్గోన్నారు.