కోదాడ,జులై 22 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉప్పల మల్సూర్, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుండి 1952 నుండి 1972 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశాడు. మన్సూర్ కి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు చనిపోవడంతో కోడళ్ళు రోడ్డు పాలయ్యారు అని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.7 వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న యాత్రలో భాగంగా మోతే మండలం లో గల మోతే,నమవరం స్టేజ్,నమవరం లాల్ తండ,సిరికొండ,రాయ్ పాడు,నేరడ వాయి,రాయపాడు గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్. అనంతరం సిరికొండలో మల్సూర్ కుటుంబాన్ని పరామర్శించిన అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956-57, 1957-62, 1962-67, 1967-72 (సిపిఎం పార్టీ)లో రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మన్సూర్ కుటుంబాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.తన సొంత గ్రామానికి సర్పంచిగా కూడా పనిచేశాడు. కానీ తనకంటూ ఏమి సంపాదించుకోకుండా తన ప్రజా జీవితాన్ని ప్రజలకి అంకితం చేశాడని అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మల్సూర్ కుటుంబానికి దళిత బందని ప్రకటించి వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న, మాలోవత్ బాలు,బండి గోపి,జగ్య, బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్చూర్ కుటుంబాన్ని మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం:కనీసం ఉంటానికి ఇల్లు కూడా సరిగా లేదు:సిరికొండ గ్రామంలో దయనీయ స్థితిలో ఇద్దరు కోడలు:డాక్టర్ అంజి యాదవ్
RELATED ARTICLES