మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జన్మదిన వేడుకలు
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోదాడ ముదిరాజ్ సంఘం నాయకులు.ఈ సందర్భంగా కోదాడ ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గాన్ని అర్థ శతాబ్దం పాటు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన వ్యక్తి అని కోదాడ ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా చందర్ రావు తోడ్పాటు అందించారని అందుకే వారి జన్మదిన సందర్భంగా చాప గుర్తులో ఉన్న జ్ఞాపికను బహూకరించడం జరిగినదని తెలిపినారు.ఈ సందర్భంగా ముదిరాజు సంఘం నాయకులను చందర్ రావు ఆప్యాయంగా పలకరించి నాజన్మదిన సందర్భంగా చాప గుర్తును జ్ఞాపికగా బహుకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో కోదాడ ముదిరాజు సంఘం కన్వీనర్ ముసి శ్రీనివాస్,రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు భాషబోయిన భాస్కర్,టి రామయ్య,సారగండ్ల సత్తయ్య,తమ్మనబోయిన వీరబాబు,చిట్టేటి వెంకటేశ్వర్లు,అల్లి వీరబాబు,చాపల శ్రీనివాస్,ముసి మట్టయ్య,గుండ్లపల్లి వెంకన్న,నాయిని మల్లయ్య,చిలకా రమేష్,చింతకాయల ఉపేందర్,లింగం రామ కృష్ణ,కంటు నాగార్జున,కన్నెబోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు