మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ..
Mbmtelugunews//వికారాబాద్ జిల్లా,ఆగష్టు 30:పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ.కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించిన గోపాల్ రెడ్డి.డిఎస్పి బాలకృష్ణారెడ్డి సీఐ అశోక్ ఎస్సై గిరి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్ సిబ్బందితో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.18 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గోపాల్ రెడ్డి పోలీసులకు తెలిపారు.దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు.



