మాటల గారడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
:నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
:టెట్,డీఎస్సీ ఉచితంగా ఆన్లైన్ చేసుకోవచ్చు అని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్న ప్రభుత్వం.
:టీఎస్పీఎస్సీ రాసి ఏడు సంవత్సరాలైనా ఇంతవరకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడంలో గత ప్రభుత్వం,ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం:డా,,అంజి యాదవ్
కోదాడ,జూన్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గత ఎన్నికలలో నిరుద్యోగులకు మాయ మాటలు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని అదేవిధంగా జూన్ 12 వ తారీఖున అన్ని ప్రచారమాధ్యమాల సాక్షిగా టెట్ అర్హత సాధించని వారికి డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి ఉచితంగా ఇస్తానని,టెట్టు అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినారు.కానీ దరఖాస్తు చేసుకుందామని ఆన్లైన్ సెంటర్ కు వెళ్తే ఈచ్ వన్ పేపర్ కు 1000 రూపాయలు ఆన్ లైన్ లో చూపెడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.నిరుద్యోగులకు శాపంగా మారిన గత ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే మా బతుకులు మారి మా జీవితాలలో వెలుగులు నిండుతాయని ఎంతో ఆశతో రేవంత్ రెడ్డి మాయమాటలకు గారడి మాటలకు మోసపోయి నిరుద్యోగులు ఏకపక్షంగా నిలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే నిరుద్యోగులను హీనంగా చూస్తుందని అన్నారు.అదేవిధంగా టీఎస్పీఎస్సీ రాసి ఏడు సంవత్సరాలైనా ఇంతవరకు ఫైనల్ లిస్టు పెట్టడంలో గత ప్రభుత్వం,ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.2017 లో టీఎస్పీఎస్సీ జారీచేసిన లాబ్ టెక్నీషియన్ 67/2017 ఉద్యోగాల కోసం పరీక్ష రాసి దాదాపు 7 సంవత్సరాల నుండి ఉద్యోగాల భర్తీ చేయడంలో గత ప్రభుత్వం విఫలం చెందిందనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే పందాలు ముందుకు పోతుందని అన్నారు.ఈ పారామెడికల్ ఉద్యోగాలు నిరుద్యోగుల జీవిత కాలం మొత్తం లో వచ్చిన మొట్ట మొదటి నోటిఫికేషన్ దాదాపు 25 సంవత్సరాలు గా ఎలాంటి నోటిఫికేషన్ వెయ్యడంలో గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.గత 7 సంవత్సరాల నుండి ల్యాబ్ టెక్నీషియన్లు టిఎస్పిఎస్ చుట్టూ తిరగగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఆరు నెలల గడుస్తున్న ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వడంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. అదే సమయంలో వచ్చిన టిఎస్పిఎస్ కి అప్లై చేసుకున్న ఫార్మసిస్టులు,ఏఎన్ఎంలు,స్టాప్ నర్సులు,ఫిజియోథెరపిస్టులు రేడియో,గ్రాఫర్స్ అందరినీ నింపారు కానీ ల్యాబ్ టెక్నీషియన్ లో విషయంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మొండి చేయి చూయించుతుందని అన్నారు.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ల
సెలక్షన్ లిస్ట్ పెట్టించి ఉద్యోగ నియామకాలు చేపట్టి వారికి న్యాయం చేయాలని అన్నారు.



