మాదకద్రవ్యాలు నివారించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి
:పిల్లల యొక్క యాక్టివిటీస్ ని తల్లిదండ్రులు గమనిస్తుండాలి.
:కళాశాలలలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు:డీఎస్పీ శ్రీధర్ రెడ్డి.
కోదాడ,జులై 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గంజాయి ఇతర మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బుధవారం కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో,కోదాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జూనియర్,డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్స్ తో ఒక సమావేశం కోదాడ డిఎస్పి ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి నెల మూడో బుధవారం రోజు పోలీసులు ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా ఒక కళాశాలలో లేదా స్కూల్ లో గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయా విద్యా సంస్థల సహకారాన్ని కోరారు.అదేవిధంగా ప్రతి కళాశాలలో,పాఠశాలలో తప్పక మాదకద్రవ్యాల వ్యతిరేక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి గంజాయి మాదకద్రవ్యాల యొక్క దుష్పరిమాణాల గురించి అలాగే దాని యొక్క ఎఫెక్ట్ సమాజంపై ఎలా ఉంటుంది అనే విషయంపై విద్యార్థులందరికీ నిరంతరం అవగాహన కల్పించే విధంగా అటు కమిటీలు వ్యవహరించాలని ఈ సందర్భంగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ను కోరడం జరిగింది.కళాశాలలో ప్రతినెల ఒకసారి కళాశాలకు సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి మాదకద్రవ్యాల నిరోధన గురించి అదే విధంగా అటువంటి వాటికి లోనైనా విద్యార్థులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండే విధంగా తగు సూచనలు చేయడం జరిగింది.అదేవిధంగా ప్రతి సంవత్సరం కనీసం రెండు పర్యాయలైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై అన్ని విషయాలతో పాటు ఈ మాదకద్రవ్యాల నిరోధనకై వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వివరించాలని కోరడం జరిగింది.మాదకద్రవ్యాలపై అవగాహన గురించి మధ్య మధ్యలో ఆయా సందర్భాలను పురస్కరించుకొని విద్యార్థులకు ఉపన్యాస వ్యాసరచన చిత్రలేఖన వంటి పోటీలు నిర్వహించడం ద్వారా వారిని జాగ్రత్త పరుస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది ఎట్టి పరిస్థితుల్లో కోదాడ పరిధిలోని కళాశాల పరిసరాలలో లేకుండా చేయడానికి విద్యా సంస్థల సహకారాన్ని అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా చెప్పడం జరిగింది.గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించి ఏదైనా చిన్న సమాచారం అయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి లేదా 100 కు తెలియజేయాలని కోరడం జరిగింది.ఈ సమావేశంలో కోదాడ పట్టణ సీఐ రాము,రూరల్ సీఐ రజిత కూడా పాల్గొన్నారు.