కోదాడ,జులై 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కోదాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఎమ్మెస్ జూనియర్ కళాశాలలో పందిటి నవీన్ కుమార్ మాదిగ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ మామిడి కరుణాకర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ తొమ్మిది సంవత్సరాలు అవుతున్న వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేయకపోవడాన్ని నిరసిస్తూ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారి నిర్ణయం మేరకు ఆగస్టు రెండో వారంలో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభకు లక్షలాదిగా విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏపూరి రాజు మాదిగ,ఎల్ హెచ్పిఎస్,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్,ఎంఎస్పి పార్టీ కోదాడ పట్టణ ఇంచార్జ్ కలకొండ
రామ్ కుమార్ మాదిగ,ఎంఆర్పిఎస్ పట్టణ ఇంఛార్జి
ఏపూరి సత్యరాజు మాదిగ,దున్న గోపి మాదిగ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
మాదిగల విశ్వరూప మహాసభకు లక్షలాదిగా తరలిరండి:మామిడి కరుణాకర్ మాదిగ
RELATED ARTICLES