మాదిగ జాతి నమ్మకద్రోహి రేవంత్ రెడ్డి ప్రభుత్వనికి మాదిగ విద్యార్థుల సత్తా చూపెడతాం:సోమశేఖర్ మాదిగ
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్)మాదిగ విద్యార్థుల కోదాడ నియోజకవర్గ స్థాయి సమావేశం కోదాడ టౌన్ లోని ఎమ్మెస్ కళాశాలలో ఎమ్మెస్ఎఫ్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందింటి నవీన్ మాదిగ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెస్ఎఫ్ జాతియ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ జాతికి నమ్మకద్రోహిగా వ్యవహరిస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా మాదిగ జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్నాడని అన్నారు.వర్గీకరణ లేకపోవడంతో విద్యా,ఉద్యోగ రంగాలలో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నదని,మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమంతో పోరాడి సాధించుకున్న వర్గీకరణ తెలంగాణలో అమలు కాకపోవడంతో నోటికాడికి వచ్చిన ముద్దను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏంటో చూపించి వర్గీకరణ అమలు చేసుకొని తీరుతామని అన్నారు.మందకృష్ణ మాదిగ పిలుపుతో డిసెంబర్ లో లక్షలాది మాదిగలతో మాదిగల ధర్మ యుద్ధ ప్రదర్శనను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నామని అందుకు ఈ నెల చివరి వారంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాదిగ విద్యార్థుల జిల్లా మహాసభ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంటుందని అందుకు వేలాది సంఖ్యలో మాదిగ విద్యార్థులు కోదాడ నియోజకవర్గం నుండి తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గం ఎమ్మెస్ఎఫ్ నూతన కమిటీని నిర్మాణం చేశారు.నియోజకవర్గ ఇన్చార్జిగా రాయల తరుణ్ మాదిగ,కో ఇన్చార్జిగా గుండెపంగు త్రినాథ్ మాదిగను నియమించారు.మండలాలకు ఇన్చార్జిలను నియమించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఎమ్మెస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ,ఎమ్మెస్పి రాష్ట్ర నాయకులు కొండపల్లి అంజయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి
సత్య రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు వల్లపట్ల వంశీ మాదిగ,రాయల గోపి,ఎమ్మెస్ఎఫ్ నాయకులు రెమిడాల అశోక్ మాదిగ,కోదాడనియోజకవర్గం లోని అన్ని మండలాల మాదిగ విద్యార్థులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు.