మానవత్వం చాటుకున్న కార్ డ్రైవర్ శ్రీను
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 05:సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఉన్న కూచిపూడి గ్రామం లోని ఇటీవల వచ్చిన వర్ష ప్రభావం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. చాలా చోట్ల వర్షాల వల్ల ఇళ్ళలో నీరు చేరి, వాగులు వంకలు పొంగిపొర్లినాయి.ఇలాంటి సమయం లో తన వంతు సాయంగా బిఎస్ఎన్ఎల్ అడ్డ డ్రైవర్ బానోతు శ్రీను ఒక సాధారణ వ్యక్తి ముందుకు వచ్చి తన ఉదారత ను ప్రదర్శించాడు.తన స్థాయి కి తగిన విదంగా మానవత్వన్ని చాటుకున్నాడు. డ్రైవర్ శ్రీను 15మందికి 10కేజీలు చొప్పున బియ్యం,కూరగాయలు పంపిణీ చేశాడు. గత మూడు రోజులు గా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం కూడా అధికారికంగా నష్టపోయినవారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రజల కోరుకుంటున్నారు.