మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం…….
Mbmtelugunews//కోదాడ,జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కోదాడ పండ్ల వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నో ఏళ్లుగా సేవకుడిగా పనిచేస్తున్నానని తనపై నమ్మకంతో పదవి ఇచ్చినా మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేదలకు తన శక్తి వంచన లేకుండా సేవ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా బషీర్ ను పలువురు అభినందిస్తూ శాలువాలు, పూల బొకేలు అందజేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ షమీ,యూనియన్ సభ్యులు బాబా,ఇస్మాయిల్,సుభాని,సలీం,రవి,సలీమా,జానీ మియా తదితరులు పాల్గొన్నారు…..