Monday, December 23, 2024
[t4b-ticker]

మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

- Advertisment -spot_img

మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

Mbmtelugunews//ములుగు జిల్లా, సెప్టెంబర్ 12:మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు ఏటూరునాగారం పోలీసుల ఎదుట బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో లొంగిపోయింది.నాగారం శివం ఉపాధ్యాయ విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.చతీస్ ఘిడ్ రాష్ట్ర పూజారి దళ సభ్యురాలు (ఏఎంసీ) పోడియం సోమిడి అలియాస్ రోని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోయిందని తెలిపారు.పూజారి కాంకెర్ పురుషం సమ్మయ్య అలియాస్ సమ్మన్న ప్రోత్బలంతో సోమిడి 2019 మిలీషియా సభ్యురాలుగా చేరింది అని అన్నారు.ఆ తర్వాత అతని దగ్గర ఆరు నెలలు పని చేసిందని రెండవ సెంట్రల్ రీజినల్ కమాండర్ దొడ్డి పూజ అలియాస్ ప్రకాష్ ఆమె కు పార్టీ సభ్యురాలుగా పదోన్నతి కల్పించారని వివరించారు.అక్కడ ఆమె దలకమాండర్ సాగర్ కు గార్డుగా సంవత్సర కాలం పాటు పని చేసిందని ఆ తర్వాత సెంట్రల్ రిజర్వ్ ఒకటవ ఫ్లాటుల్లో చేరిందని వివరించారు.2023 ఆమె ఏరియా కమిటీ సభ్యురాలుగా హోదా పొందినారు.సోమిడికి రూలు నాలుగు లక్షల రివార్డ్ ఉందని ఏఎస్పీ తెలిపారు.ఆయా హోదాల్లో పనిచేసినప్పుడు పలు హింసాత్మక సంఘటనలో సహా చతిస్ ఘిడ్ రాష్ట్రం కర్రెగుటల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె పాల్గొంది అని తెలిపారు.ఆ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని అన్నారు.ఎన్నికల సమయంలో జాగురాగొండ పిఎస్ పరిధిలోని కుందేర్ గ్రామంలో ముగ్గురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లను కాల్చిచంపిన సంఘటనలో సోమిడి పాల్గొన్నారని తెలిపారు.ధర్మారం క్యాంపుపై జరిగిన దాడిలో పెద్ద బట్టుమ్లో లోని కవురా గుట్టల్లో జరిగిన పోలీస్ కాలపుల్లో తప్పించుకుందని వివరించారు.మావోయిస్టు పార్టీ భావాజాలంపై విరక్తితో సోమిడీ బయటికి వచ్చిందని అన్నారు.డబ్బులు వసూలు చేసి ముఖ్య నేతలకు పంచే విధానం నచ్చక జన జీవన స్రవంతిలో కలుస్తుందని ఎస్పీ తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular