Wednesday, December 24, 2025
[t4b-ticker]

మావోయిస్టు పార్టీ కమాండర్ ఇన్ చీప్ గా తిప్పరి తిరుపతి?

మావోయిస్టు పార్టీ కమాండర్ ఇన్ చీప్ గా తిప్పరి తిరుపతి?

Mbmtelugunews//ఖమ్మం జిల్లా,సెప్టెంబర్09 ప్రతినిధి:
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నంబాల కేశవరావు, అలియాస్ బస్వరాజు అలియాస్ గంగన్న ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆ పార్టీ కొత్త దళపతి ఎవరనే చర్చ ప్రారంభమైంది. కమ్యూనిస్టు, విప్లవ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలతో పాటు సర్కారు వర్గాల్లో ముఖ్యంగా సాయుధ బలగాల్లో ఈ ప్రశ్న ఉదయిస్తోన్నమాట వాస్తవమే….

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు తెలంగాణ నేతల్లో ఒకరికి లేదా? బెంగాల్‌కు చెందిన నాయకునికి ఈ బాధ్యతలు తాత్కాలికంగా అప్పగిస్తారనే అభిప్రాయా లు వ్యక్తం అవుతుండగా. తాజాగా మావోయిస్టు పార్టీ కొత్త చీఫ్‌గా తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవుజీ,ని కొత్త సెక్రెటరీగా నియమించినట్టు తెలిసింది.

అయితే.. మావోయిస్టు పార్టీలో ప్రత్యేక ప్లీనరీ, లేదా మహాసభల్లో మాత్రమే పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఎన్కౌంటర్లో మరణించిన కేశవరావు,ఆలియాస్ బసవరాజు,మృతి చెందిన మూడున్నర నెలల తర్వాత మావోయిస్టు పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవోజిని, కొత్త కేంద్ర నాయ కుడిగా నియమించినట్లు సమాచారం.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular