మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు
Mbmtelugunews//అనంతగిరి, అక్టోబర్ 05(ప్రతినిధి నూకపంగు ఈదయ్య): మండల పరిధిలోని త్రిపురవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నటువంటి బాల్య మిత్రుడు పాలవరం గ్రామానికి చెందిన గాదే వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది.తనతో పాటు చదువుకున్న మిత్రులందరు మిత్రుడు కుటుంబానికి అండగా ఉండాలని తలచారు దానిలో భాగంగా వీరబాబు కుటుంబానికి సుమారు 75 వేల రూపాయలను ఇద్దరు కూతుర్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సంబంధిత పుస్తకాలను మిత్రులందరు కలిసి వారికి అందించడం జరిగింది.వీరు అందించిన సహాయం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.