మిర్చి కల్లాల యజమాన్యంపై చర్యలు తీసుకోండి
:ఏనుమాముల సిఐ కి నాయకుల వినతి.
Mbmtelugunews//ఏనుమాముల,మే 12:మిర్చి కల్లాల వద్ద తొడిమెలను తగులబెడుతూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్న మిర్చి కొల్లాల యజమాన్యంపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం ఏనుమాముల సీఐ రాఘవేందర్ ను కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సయ్యద్ ఇంతియాజ్ మాట్లాడుతూ మిర్చి కల్లాల యజమాన్యం కూలీలతో తొడిమెలు తీయించుకున్న అనంతరం అట్టి తొడిమెలను కల్లాల వద్ద తగలబెట్టడం వల్ల ప్రజలు శ్వాసకోశ,దగ్గు దమ్ము,టీవీ,ఆస్తమా వ్యాధులతో పాటు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇట్టి సమస్యపై తాము గతంలో అనేకసార్లు మున్సిపల్,వ్యవసాయ మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.ఇటీవల లాలా ట్రేడర్స్ వారు మిర్చి తోడిమెలను తగలబెట్టడం వల్ల భారీ ఎత్తున మంటలు లేవడంతో తాము పోలీసుల సహకారంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు.అయినప్పటికీ ఫైర్ ఇంజన్ కు మంటలు అదుపు కాకపోవడంతో జెసిబి డోజర్ లతో సుమారు మూడు గంటల పటు ఫైర్ సిబ్బంది పోలీసులు తాము అతి కష్టం మీద మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు.ఇట్టి సమస్యపై తాము మిర్చి కల్లాల యాజమాన్యాన్ని అడుగగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పకుండానే బెదిరింపు ధోరణికి పాల్పడుతుండడంతో తాము ఏనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.తమ ఫిర్యాదుపై స్పందించిన సీఐ రాఘవేందర్ మిర్చి కల్లాల యజమాని పిలిపించి మాట్లాడడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ముడుసు నరసింహ,ఈర్ల రాజేందర్,మచ్చర్ల స్టాలిన్,పిట్ట నగేష్,ల్యాగల బిక్షపతి,ఓర్సు అంజయ్య,ఉబిది సారంగం తదితరులు పాల్గొన్నారు.