మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఓరుగంటి బ్రహ్మం …
Mbmtelugunews//కోదాడ, జనవరి 10( ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చిన్నపరెడ్డి అధ్యక్షతన జరిగిన మిల్లర్ల సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షునిగా ఓరుగంటి వెంకట బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా కొత్త బ్రహ్మయ్య, కోశాధికారిగా నరేంద్రుని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా పశ్యా నవీన్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా మట్టా కృష్ణారెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, గౌరవ సలహాదారులుగా జి సత్యనారాయణ, కే నర్సిరెడ్డి లను మిల్లర్లు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బ్రహ్మం మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన మిల్లర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొనే ఏ విధమైన సమస్యలకైనా సామరస్య పూర్వక పరిష్కార మార్గాలకు ప్రయత్నిస్తానన్నారు. అధికారులకు, మిల్లర్లకు, హమాలీలకు సమన్వయకర్తగా పనిచేస్తూ వివాదరహితంగా మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతలను నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మిల్లర్లు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



