మిస్సింగ్ కేసు నమోదు
Mbmtelugunews//కోదాడ, జనవరి 16:: మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన అల్సగాని వెంకటేశ్వర్లు తండ్రి నరసింహారావు వయస్సు 43 సంవత్సరాలు, వృత్తి ప్రభుత్వ టీచర్ అను అతను అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. అతను తేదీ 14.01.2026 న సాయంత్రం సుమారు 04:00 సమయంలో చిమిర్యాల లో తన ఇంటిలో తన మొబైల్ ఫోన్ పెట్టి తన మోటార్ సైకిల్ నెంబర్ TS-29-C-1898 గల మోటార్ సైకిల్ వేసుకుని ఇంటి నుండి బయటకు వెళ్లి రాత్రి వరకు కూడా ఇంటికి రాలేదు. అతని కుటుంభ సబ్యులు బంధువుల ఇండ్ల వద్ద, స్నేహితుల ఇండ్ల వద్ద,చిమిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల వద్ద వెతికినా గాని ఆమె భర్త ఆచూకీ లభించలేదు. అతని బార్య అల్సగాని రజినీ పిర్యాదిమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని కోదాడ రూరల్ ఎస్సై ఎస్ రమేష్ తెలిపారు. ఇతని ఆచూకీ తెలిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు తెలపగలరు. ఎస్సై కోదాడ రూరల్ సెల్. 8712686043, 8712680150



