హైదరాబాద్:అక్టోబర్ 03(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ ఇండస్ట్రీ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరుతగా వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు.
మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడిగా చిన్న చూపు ధోరణని ప్రశ్నించడమే కానీ సినీనటి సమంత, మనోభాలను దెబ్బతీయాలని కాదు అంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు.
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం కాదు..అదర్శం. నా వ్యాఖ్యలపట్ల మీరు కానీ…మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే నా వ్యాఖ్యలను పూర్తి ఉపసంహరించుకుంటున్నాను..మీరు అన్యద భావించవద్దు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కొండాసురేఖ. ఇక నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.
చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు.