ముగిసిన ఇంటర్ స్కూల్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు………
:ఇంటర్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి:డా, సుబ్బారావు
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 02 (ప్రతినిధి మాతంగి సురేష్)గత రెండు రోజులుగా బాలాజీనగర్ కోదాడ యందు నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ ఇంటర్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి విద్యార్థులు రాణించాలని కోరారు.చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక బలం పెరుగుతుందన్నారు.ఇంటర్ స్కూల్ లెవెల్ పోటీలలో ఎస్ఆర్ఎం స్కూల్ కోదాడ విన్నర్ విజేతగా,తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ చిలుకూరు రన్నర్ గా ఛాంపియన్షిప్ ట్రోపీలు గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్,కోదాడ క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్,ప్రధానకార్యదర్శి సిద్ధిక్,క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు చందా శ్రీనివాసరావు,దర్గయ్య,నాగేశ్వర్రావు,బడుగుల సైదులు,కాజా మియా,ఏడుకొండలు,జబ్బారు,శ్రీకాంతు,సురేషు,బుల్లయ్య,శ్రీనివాసు,పాఠశాలల యాజమాన్యాలు,క్రీడాకారులు పాల్గొన్నారు.