కోదాడ,నవంబర్ 13(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:90-కోదాడ అసెంబ్లీ ఎన్నికల స్క్రూట్నీ ముగిసిందని 90 కోదాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో మొత్తం 39 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా సోమవారం స్క్రూట్నీలో ముగ్గురు సరైన పత్రాలు సమర్పించకపోవడంతో వారిని తిరస్కరించినట్లు తెలిపారు. వారిలో 1) నూకల పద్మా రెడ్డి నోటరీ సమర్పించకపోవడం వలన స్క్రూట్నీలో తీసేయడం జరిగిందని అన్నారు.2) చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ప్రపోజల్ సంతకాలు చేయకపోవడం వలన స్క్రూట్నీలో తీసేయడం జరిగిందని అన్నారు.3) చెవుల వెంకటేశ్వర్లు ప్రపోజల్ సంతకాలు చేయకపోవడం వల్ల స్క్రూట్నీలో తిరస్కరించడం జరిగిందని అన్నారు.90-కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 39 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 3గురు స్క్రూట్నీలో తిరస్కరించబడినారన్నారు.స్క్రూట్నీలో 36 మంది అభ్యర్థులు ఉన్నారని ఆర్ఓ సూర్యనారాయణ తెలిపారు.
ముగిసిన స్క్రూట్నీల పర్వం:కోదాడ బరిలో 36 మంది అభ్యర్థులు: ఆర్ఓ సూర్యనారాయణ
RELATED ARTICLES



