మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందించిన మున్సిపల్ పాలకవర్గం
కోదాడ,ఆగష్టు 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపాలిటీ నిధులు, ఫడ్ డైవర్షన్ కొరకు,కోదాడలో ఉన్న ఇండ్ల పైన ఉన్న కరెంట్ లైన్స్ తీసివేయట గురించి,గ్రామ కంఠంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు మంజూరు గురించి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.అలాగే మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న చాలామంది గతంలో గ్రామకంఠంలో ఇల్లులు నిర్మించుకున్నారు.వారికి మున్సిపల్ ఏర్పడినాక మున్సిపాలిటీ వారు ఇంటి నెంబరు ఇవ్వడం లేదు కావున అలాంటి వారికి ఇంటి నెంబర్లు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు.ఇలా మున్సిపల్ పై అనేక సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంధం యాదగిరి,తిప్పిరి శెట్టి రాజు,కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.