ముమ్మరంగా వాహన తనిఖీలు ఎస్సై తాజుద్దీన్
ములుగు,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ములుగు జిల్లా ఏటూరు నాగారం లో ఎస్పీ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏ ఎస్పి సూచనలు మేరకు మావోయిస్టుల బందు నేపథ్యంలో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్,ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు.గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలలోని గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు దళ సభ్యుడు వృత్తి చెందిన విషయం తెలిసిందే.సోమవారం దామరతోగు ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ ములుగు,భూపాలపల్లి జిల్లాల బందుకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పోలీస్ బలగాలు మోహరించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.దామరతోగు ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ ములుగు,భూపాలపల్లి జిల్లాల బందుకు పిలుపునివ్వడంతొ మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసు బలగాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్. సివిల్ సిఆర్పిఏఫ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.