ముమ్మరంగా సబ్ జూనియర్స్ బాలబాలికల కోచింగ్ క్యాంపు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాలికల కోచింగ్ క్యాంపు వైష్ణవి స్కూల్ లో జరుగుతునట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామా నరసింహ రావు తెలిపారు. జిల్లా లో ఎన్నడూ లేని విదంగా క్రీడాకారులకు ప్రో కబడ్డీ మ్యాట్ మీద అనువాజులైన కోచ్ జాతీయ క్రీడాకారుల పర్యవేక్షణ లో అన్ని వసతులతో నిర్వహించడం క్రీడాకారులకు గొప్ప అవకాశం అని ఈ క్యాంపు లో 25 మంది బాలురు 25 మంది బాలికలు క్రీడాకారులు ఉన్నారు. మంచి ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేసి 28 క్రీడాకారులను సెప్టెంబర్ 25 నుండి 28 వరకు నిజామాబాదు జిల్లా లో జరగబోయే తెలంగాణా రాష్ట్ర కబడ్డీ పోటీలలో పాల్గొంటారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాంచంద్రయ్య, జాతీయ క్రీడాకారులు రమేష్ బాబు, కోటేశ్వరరావు, సృజన్, కోశాధికారి సైదులు, బసవయ్య, పిఈటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.



