మా విజన్ వేరు..
:కంపెనీలను హైదరాబాద్ కే పరిమితం చెయ్యం.
:31,500 కోట్ల పెట్టుబడులు..30, 750 ఉద్యోగాలు.
:మేము ఎంటర్టైన్మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు..
:మూసీ సుందరీకరణపై ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో చర్చించాం:మంత్రి శ్రీధర్ బాబు
Mbmtelugunews//హైదరాబాద్,ఆగస్టు 18:రాష్ట్రం లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,సౌత్ కొరియా పర్య టనలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.శనివారం సచివాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.విదేశీ పర్యటనపై కొంతమంది సినిమా షో ప్లాప్ అయ్యిందని అంటున్నారని..మా విజన్ వాళ్ళ ముందు పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.హైదరాబాద్ వరకే కంపెనీ లను పతిమితం చెయ్యమని..ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతామన్నారు.19 సంస్థలతో 31 వేల 500 కోట్ల ఓప్పందం చేసుకున్నామని తెలిపారు.దీని ద్వారా 30,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నా రు.అమెరికా సౌత్ కొరియా పర్యటనలో కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నామన్నారు శ్రీధర్ బాబు.పెట్టుబడు లే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లామని చెప్పారు.పర్యటన హిట్టయిందా? ప్లాప్ అయ్యిందా అన్న ప్రశ్న కాదు పె ట్టుబడులురావాలి.. యువతకు ఉద్యోగాలురా వాలన్నదే తమ లక్ష్యమన్నారు.