మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
కోదాడ,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఆత్కూరి హనుమంతరావు ఇటీవల ఆనారోగ్యంతోమృతిచెందాడు.ఆయన దశదినకర్మ కార్యక్రమాలకు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు కాసాని వెంకటేశ్వర్లు సోమవారం 10వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పేద ప్రజలకు విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.ప్రతిఒక్కరు తమకు ఉన్నదానిలో కొంత మేర సేవకార్యక్రమాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్కూరు శ్రీనివాసరావు,పెద్దారపు సైదులు,తెల్ల గోర్ల కొండ,వెలుట్ల వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.