కోదాడ,జనవరి 16(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మెగా( ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అండ్ గైడర్స్ అసోసియేషన్) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి బి ప్రకాష్ యాదవ్ పాల్గొని క్యాలెండర్ ను ఆయన చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయిస్ ఒక యూనిట్ గా ఉంటే ప్రభుత్వం నుండి ఎంప్లాయిస్ కి రావాల్సిన వాటిని పొందటానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మెగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్ పాషా,జహీర్ ఖాన్,కోదాడ డివిజన్ ఎంఈఓ సలీం షరీఫ్,ముఖ్య సభ్యులు మరియు గైడర్స్ పాల్గొనడం జరిగింది.
మెగా క్యాలెండర్ ఆవిష్కరణ
RELATED ARTICLES



