మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి:డా,హదస్సా రాణి
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్ ), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ (డిఈఈటి) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈనెల 25/10/2025 వ తేదీ (శనివారం) హుజూర్ నగర్ లో పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనుక హుజూర్ నగర్ లో మెగాజాబ్ మేళా నిర్వహిస్తోంది. కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.హదస్సా రాణి ఒక ప్రకటన లో తెలిపారు.విద్యార్థులు తమ ఐదు సెట్ల బయోడేటా తో పాటు రెండు పాస్ ఫోటోలతో హాజరవ్వగలరని కళాశాల ప్లేస్ మెట్ అధికారి డా,బి సైదిరెడ్డి తెలిపారు.జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులకు భోజన సదుపాయం కలదు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.



