Sunday, March 15, 2026
[t4b-ticker]

మేళ్లచెరువు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాలను సందర్శన……

మేళ్లచెరువు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాలను సందర్శన……

:విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ వి. మురళి సస్పెండ్….

:ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి…

Mbmtelugunews// మేళ్లచెరువు, మార్చి 15: ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మేళ్లచెరువు గురుకులంలో విద్యార్థులు నీళ్లు లేవని అధికారుల దృష్టికి తీసుకురాగా గురువారం ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ సీతాలక్ష్మి పరిశీలనకు వచ్చారు ముందుగా పిల్లలతో గురుకులంలో జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో ఉన్న సమస్యలన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గురుకుల భవనాన్ని పరిశీలించారు గురుకులం ప్రైవేట్ భవనంలో ఉన్నందున పార్టీ యజమాని అహ్మదును పిలిచి సెక్రటరీ మాట్లాడారు అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు విధులలో నిర్లక్ష్యం వహించినందున గురుకుల నిర్వహణ విద్యార్థుల నుండి వచ్చిన వివిధ ఆరోపణలపై గురుకుల ప్రిన్సిపల్ వి మురళిని సెక్రెటరీ సీతాలక్ష్మి సస్పెండ్ చేశారు వైస్ ప్రిన్సిపల్ డి మధుకర్ కు తాత్కాలిక ప్రిన్సిపల్ గా బాధ్యతలు ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం మిషన్ భగీరథ అధికారులు గురుకులం పరిశీలించి త్రాగునీటి కల్పనకు కావలసిన పైపులైన్లను అంచనా వేయగా పరిశీలించిన సెక్రటరీ రెండు లక్షల రూపాయలు మిషన్ భగీరథ నేటి కొరకు మంజూరు చేశారు అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ ఆటోల సామాగ్రిని పంపిణీ చేశారు..

ఈ కార్యక్రమంలో నల్గొండ రీజియన్ సమన్వయకర్త బలరాం, వైస్ ప్రిన్సిపల్ మురళీధర్, విజిలెన్స్ ఆఫీసర్ నటరాజ్ , అకౌంట్ సెక్షన్ రవికుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ కాంతా రాజు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular