మేళ్లచెరువు శివాలయానికి పోటెత్తిన భక్తజనం
Mbmtelugunews//హుజూర్ నగర్/మేళ్లచెరువు,నవంబర్ 15(ప్రతినిధి చింతా రెడ్డి గోపిరెడ్డి):పరమ పవిత్రమైన కార్తీకమాసము కార్తీక పౌర్ణమి సందర్భముగా ఈరోజు స్థానిక శ్రీ స్వయంభు శంభులింగేశ్వర
స్వామి దేవస్థానములో తెల్లవారుఝామున 4 గంటల నుండి అభిషేకాలకు,శ్రీస్వామి వారి దర్శనం కోసము భక్తులు
బారులు తీరారు.ఆలయ రెనివేషన్ కమిటీ చైర్మెన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి ల
పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గం.లకు శ్రీ స్వామి
వారికి రుద్రాభిషేకము తదుపరి భక్తులకు అభిషేకములు నీరాజన మంత్రపుష్పములు,తీర్ధప్రసాద వినియోగము
జరిగినది.ఈసందర్భముగా జనిగ సైదులు మాజీ ఎంపీటీసీ మేళ్లచెరువు,బుర్రా శంభయ్య, బుర్రా లింగయ్య,బుర్రా
నరసింహారావు,బుర్రా శంకర్ రావు,బుర్రా వెంకటేశ్వర్లు,బుర్రా రవి,బుర్రా సంజీవ్,చల్లా పుల్లయ్య,ఫోకస్ కంపూటర్స్,వీనస్ కంప్యూటర్స్ మేళ్లచెరువు గ్రామ వాస్తవ్యులు భక్తులకు,అయ్యప్ప స్వాములకు మహా అన్నదానము
నిర్వహించబడినది.అధిక సంఖ్యలో మహిళలు దేవాలయ ప్రాంగణములో దీపాలు వెలిగించారు.సాయంత్రము జ్వాల
తోరణము వెలిగించి జ్వాల తోరణము క్రింద నుంచి భక్తులు నడిచారు ఇట్టి కార్యక్రమములో రెనివేషన్ కమిటీ చైర్మెన్
శాగంరెడ్డి శంభిరెడ్డి,ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జులు కొండారెడ్డి,రెనివేషన్ కమిటి సభ్యులు ఓరుగంటి
నరసింహారావు,కర్నాటి సత్యనారాయణరెడ్డి,కమతం శ్రీనివాసరావు,శాగంరెడ్డి గోవిందరెడ్డి,సుంకరబోయిన చందర్
రావు,పందిరి నాగిరెడ్డి,చిన్నపంగు చిన్నబాబు,వున్నూరి వెంకటేశ్వర్లు,పసుపులేటి శంభయ్య, గ్రామ పెద్దలు
కాకునూరి భాస్కర్ రెడ్డి,గజ్జల శంకర్ రెడ్డి,నాగేళ్ల సత్యనారాయణరెడ్డి,కొప్పురావూరి పూర్ణచందర్ రావు,ఆలయ
అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ, సిబ్బంది కొండారెడ్డి,నర్సింహారెడ్డి అయ్యప్ప స్వాములు
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు,మేళ్ళచెరువు ఎస్సై పరమేష్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు
నిర్వహించినారు.
*శివాలయమును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి*
కార్తీక పౌర్ణమి సందర్భముగా హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి జె.శ్యాంకుమార్ దంపతుల యుక్తముగా నల్లగొండ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి యం. సందేశ్ కుమార్,స్థానిక శ్రీ
ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవస్థానములో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భముగా అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధనశర్మ ఈఓ వారిని సాదరముగా ఆహ్వానించి,ఆలయ మర్యాదలతో
స్వాగతము పలికి శ్రీ స్వామి వారి శేషవస్త్రము తో సత్కరించి,తీర్ధ ప్రసాదములు అందజేశారు.ఇట్టి కార్యక్రమములో
ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జులు కొండారెడ్డి,శాగంరెడ్డి,శంభిరెడ్డి పాల్గొన్నారు.