మైనర్లు డ్రైవింగ్ చట్టరీత్యా నేరం
:మైనర్ డ్రైవింగ్ లను తల్లిదండ్రులు ప్రోత్సహించుట తప్పు.
: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని
Mbmtelugunews//కోదాడ, జనవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్): మైనర్లు డ్రైవింగ్ చేయరాదు మైనర్ డ్రైవింగ్ లను ప్రోత్సహించటం తల్లిదండ్రుల తప్పే అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని అన్నారు. బుధవారం స్థానిక తేజ పాఠశాలలో రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన నియమాలను గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని పాల్గొని మాట్లాడుతూ చిన్నపిల్లలు మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేయడం వలన జీవితాలు ప్రమాదాల్లో పడతాయని సందేశం ఇచ్చారు. అదే విధంగా పెద్దలు కూడా చిన్నపిల్లలకు మోటర్ వాహనాలు ఇవ్వొద్దని చట్టరీత్యా పెద్దవాళ్ళు శిక్షించబడతారని తెలియజేశారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, ఓవర్ స్పీడ్ గా వాహనాలు నడపవద్దని సూచనలు చేశారు.ఈ యొక్క సూచనలు తప్పనిసరిగా పాటించాలని భవిష్యత్తులో జీవితము అంధకారంలో పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పిల్లలకు పదేపదే తెలియపరిచి పిల్లలతో మోటివేషన్ గా అందరితో ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో సెక్రటరీ సంతోష్ కుమార్, ప్రిన్సిపాల్ సోమ నాయక్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



