Thursday, December 25, 2025
[t4b-ticker]

మైనార్టీలకు 100% సబ్సిడీతో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,ఆగష్టు 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మైనార్టీల ను కడుపులో పెట్టుకొని చూసే కునే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మైనార్టీలకు మంజూరైన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ముస్లింలు విద్య పరంగా సామాజిక ఆత్మగౌరవంతో బతికే విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ముస్లిం పిల్లలు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య చదివేందుకు మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి వసతి తో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఇండ్లకే పరిమితమైన ముస్లిం ఆడపిల్లలు నేడు ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు.మైనార్టీ ల విదేశీ విద్య కోసం ఆర్ధిక సహాయం అందజేస్తామన్నారు.చదువు సంధ్యలకు దూరమై పలు వృత్తుల్లో ఉన్న ముస్లిం యువకులు నేడు ఉన్నత విద్యల అభ్యసిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఉపాధికి అనేక పథకాలను అమలు చేస్తూ వారి జీవన పరిస్థితుల్లో మార్పులు తెచ్చామన్నారు సంక్షేమం కోసం మసీదుల నిర్మాణానికి షాదీ ఖానాల నిర్మానానికి,ఖబరాస్తా న్ ల నిర్మాణానికి వేల రూపాయల బడ్జెట్ మంజూరు చేశారన్నారు.మసీదుల్లో మౌజన్ లకు,ఇమామ్లకు గౌర వేత నం ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపా మన్నారు.రంజన్ పండుగ పేద వాళ్ళు సంతోషం గా చేసుకోడానికి దుస్తులు,ఇఫ్తార్ విందులు ఏర్పటు చేశామన్నారు.మైనార్టీలకు లక్షరుపా యలు మైనార్టీ బంధు ప్రకటించి వారి కి జీవనోపాధి కల్పిస్తూ న్నా మన్నారు.మైనారిటీ లకు తాను అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ శంకర్,నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు,మైనార్టీ నాయకులు నయీమ్,నిజాం,లాల్ మహ్మద్,జలీల్ అహ్మద్,కౌన్సిలర్లు ఖాజా మొయినుద్దీన్,షఫీ,కల్లూరి పద్మజ,కందుల చంద్రశేఖర్,సాదిక్,వంటిపులి రమా శ్రీనివాస్,గ్రంథాలయ చైర్మన్ రహీం,మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,సర్పంచులు,ఎంపీటీసీలు,మండల పార్టీ అధ్యక్షులు నాయకులు,యువత అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్,మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular