మొంథా తుఫానుకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
: టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్):గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మొంథా తుఫానుకు రైతులు పూర్తిగా నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని రామలక్ష్మీపురం బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో మొంథా తుఫానుకు పంట పూర్తిగా నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టం జరిగినప్పుడు పూర్తిస్థాయిలో పరిహారం అందక రైతులు అగచాట్లు పడుతున్నారన్నారు. రైతులు కష్ట నష్టాలు పడుకుంటూ పొలం సాగుచేసి పంట చేతికి వచ్చే సమయానికి నష్టం జరగడంతో రైతు దిక్కు తోచని స్థితిలో ఉన్న సమయంలో ప్రభుత్వం సంబంధిత అధికారులతో పంట నష్టం అంచినావేయించి రైతులను ఆదుకోవాలని అన్నారు.



