మొంథా తుఫాను వరదలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
:రాత్రి సమయంలో వేమరపాటుగా ఉండరాదు
:సహాయక చర్యలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్.
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్): మంగళవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో మునక ప్రాంతాలలో ఇళ్లల్లోకి నీరు చేరుతున్నాయి కావున ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కలవర్టులు పూర్తిగా తెగిపోవడంతో వరద తీవ్రతకు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నది కావున వాహనదారులు నీటిని దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని దాటాలని అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలో ఎగువ పంట పొలాలు చెరువుల నుండి బస్టాండ్ చెరువు కు భారీగా వరద రావడంతో ఎప్పటిలాగే దిగువ సారంగయ్య చెరువుకు వెళ్ళు ప్రధాన కాలువ నుండి నీటి ప్రభావం ఎక్కువగా ఉండటంతో బీసీ కాలనీ ఎస్సీ కాలనీ తో పాటు సగం ఊరు నీటిలో మునిగిపోయిందని అన్నారు.
గ్రామం మీదకు వరద తాకిడి రాకుండా జెసిబి సహాయంతో స్థానికులతో కలిసి చాకిరాల రత్నవరం వెళ్ళు రహదారికి గండిపెట్టించి దిగువకు నీళ్లు వెళ్లే విధంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ సహాయక చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం ఇచ్చి అధికారితో కలిసి వరద ప్రాంత లో పర్యటించారు.ఈ పర్యటనలో తాసిల్దార్ రామకృష్ణారెడ్డి ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎస్సై జి అజయ్ కుమార్, ఆర్ ఐ గోపాలకృష్ణ, ఎంపీ ఓ విజయలక్ష్మి, కార్యదర్శి ఉమా, జిపిఓ సిహెచ్ కోటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీను, పాతకోట్ల శ్రీను, మాజీ వార్డ్ నెంబర్లు లింగయ్య, రాము, విజయ రామారావు, సురేష్, నాగరాజు, అర్జున్, ప్రవీణ్, బాలాజీ నాయక్, అభిమన్యు, శ్రీకాంత్, లక్ష్మయ్య చారి, నవీన్, శ్రీను, సందీప్, విజయ్, ఆనంద్, భాను, సతీష్, గోపి, రియాజ్, అక్రమ్, కిషోర్, రఫీ, దనాచారి, సందీప్ తదితరులు ఉన్నారు.



