Wednesday, December 24, 2025
[t4b-ticker]

మొంథా తుఫాను వలన నష్టపోయిన రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

మొంథా తుఫాను వలన నష్టపోయిన రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

:తుఫాన్ వల్ల నష్టపోయిన అన్నదాతలను పరామర్శించిన బీఎస్పీ కోదాడ ఇంచార్జీ నూకల గోపాలస్వామి యాదవ్

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో మొంథా తుఫాన్ కారణంగా పంట పొలాలు నీట మునిగి కిందపడిపోయినాయి. నష్టపోయిన వరి పొలాలను బీఎస్పీ కోదాడ నియోజకవర్గం ఇంచార్జి నూకల గోపాలస్వామి యాదవ్ పరిశీలించి కన్నీరుమున్నీరై విలపిస్తున్న రైతన్నలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల దయనీయ పరిస్తితిని అర్ధం చేసుకొని రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఆరు కాలం పంటను పండించి కోసుకునే సమయానికి ఈ తుపాను వచ్చి రైతులను ఆర్థికంగా కుంగదీసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కోదాడ అధ్యక్షుడు కాంపటి వీరస్వామి, రమావత్ జాను, లింగయ్య, జంగయ్య, ఉప్పలయ్య, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular